: బాహుబలి మరో డైలాగ్ ట్రైలర్, ఏముందంటే..!


కోట్లాది రూపాయల పెట్టుబడితో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'బాహుబలి' చిత్రం విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ, సినీ ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. ఇప్పటికే రానా, అనుష్కల మధ్య డైలాగులను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా, రమ్యకృష్ణ డైలాగ్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో మహిష్మతి సైన్యం తిరుగుబాటుదారులపై విరుచుకు పడటం, వాళ్లను తాళ్లతో స్తంభాలకు కట్టి హింసించడం వంటి దృశ్యాలతో పాటు "వీళ్ల తిరుగుబాటుతో మహిష్మతికి మలికిపట్టింది. రక్తంతో కడిగెయ్" అని రమ్యకృష్ణ ఆవేశంగా అంటుండటం కనిపిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News