: నల్గొండ జిల్లాలో కేశినేని బస్సు బోల్తా
ప్రైవేటు బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. నిత్యమూ ఏదో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏపీ 16 టీసీ 3773 నంబరుగల కేశినేని ట్రావెల్స్ బస్సు నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద బోల్తా పడింది. హైదరాబాదు నుంచి ఏలూరు వెళ్తున్న ఈ బస్సు మార్గమధ్యంలో, లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, 15 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను సూర్యాపేటలోని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.