: ఉపాధ్యాయుడి పెళ్లి ఎంత పని చేసింది!
గుంటూరు జిల్లాలోని కొమ్మూరు పాఠశాల ఉపాధ్యాయుడి వివాహం ప్రధానోపాధ్యాయురాలి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సహోద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు లీవ్ పెట్టుకుని వెళ్లాల్సిన సిబ్బంది, ఏకంగా ఆప్షనల్ హాలిడేను ప్రకటించుకుని సెలవు ఇచ్చేశారు. పండగల సందర్భంగా వాడుకోవాల్సిన ఆప్షనల్ హాలిడేను వ్యక్తిగత వేడుకకు వినియోగించుకున్నారు. ఇది మీడియా పతాక శీర్షికలకెక్కడంతో విచారణ చేసిన అధికారులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.