: సరుకులతో అంతరిక్షానికెగిసిన రష్యా స్పేస్ షిప్


పరిశోధనల కోసం రోదసిలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు సరుకులు చేరవేసేందుకు రష్యా ప్రయోగించిన స్పేస్ షిప్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ పైలట్ రహిత కార్గో నౌకలో 6,100 పౌండ్లకు పైగా బరువున్న ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు ఉన్నాయి. బైకనూర్ లోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రోగ్రెస్ ఎం-27ఎం రాకెట్ ను శుక్రవారం ప్రయోగించారు. లాంచ్ చేసిన పది నిమిషాల్లోపే ఇది ప్రాథమిక కక్ష్యలోకి ప్రవేశించిందని, దీని సోలార్ ప్యానళ్లు, నేవిగేషనల్ యాంటెన్నాలు పని చేయడం ప్రారంభించాయని నాసా తెలిపింది. జులై 5న ఈ స్పేస్ షిప్ ఐఎస్ఎస్ కు చెందిన డాకింగ్ కంపార్ట్ మెంట్ తో అనుసంధానం అయ్యే ప్రక్రియను నాసా లైవ్ గా ప్రసారం చేయనుంది.

  • Loading...

More Telugu News