: కోడలికి ప్రాణం పోసిన అత్త!


సినిమాల పుణ్యమో, లేక టీవీ సీరియళ్ల నిర్వాకమో కానీ అత్తా కోడళ్లు అంటే కీచులాడుకుంటారని, ఎత్తుకు పై ఎత్తులతో అణచివేసుకుంటారనే అపప్రథ ఏర్పడింది. అది తప్పని, కోడలంటే కూతురేనని ఢిల్లీలో ఓ అత్త నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ ఢిల్లీకి చెందిన కవిత గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలు పాడైపోయాయని, వీలైనంత త్వరగా కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాలని తెలిపారు. దీంతో కిడ్నీ దాత కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో కవిత తల్లి కిడ్నీ ఇస్తానంటూ ముందుకొచ్చారు. చివరి నిమిషంలో ఆమె వెనకడుగు వేశారు. దీంతో కవిత అత్త విమల స్పందించి కోడలికి కిడ్నీ ఇచ్చారు. దీంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తైంది. అత్తా కోడళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని, నిజ జీవితంలో ఇలాంటి అత్తా కోడళ్లను చూడడం ఆనందంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News