: సాహస బాలుడు వీధినపడ్డాడు
సాహస బాలుడు వీధినపడ్డాడు. 2008లో ఢిల్లీ నడిబొడ్డున బారబంక రోడ్డులో బాంబుపేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. బాంబు పేలుడుకు పాల్పడిన దుండగులను గుర్తించడంలో బెలూన్లు అమ్ముకునే బాలుడు సహాయపడ్డాడు. దీంతో అతనికి 2009లో రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలుడు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా బాలుడి విద్య ఖర్చు మొత్తం భరించి, 18 ఏళ్లు దాటిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని అప్పా ఘర్ సలామ్ బాలల ట్రస్ట్ అనే సంస్థ బాలుడికి ఆశ్రయం కల్పించింది. సంస్థ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు వసతి గృహంలో ఆశ్రయం పొందేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతో ఇంటర్ వరకు చదివించిన ఆ బాలుడ్ని, 18 ఏళ్లు నిండడంతో అప్నా ఘర్ సలామ్ బాలల ట్రస్ట్ అతడిని బయటకు పంపించింది. దీంతో ఆ బాలుడు వీధిన పడ్డాడు. ఢిల్లీ వీధుల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దీనిపై ఓ సామాజిక కార్యకర్త ప్రధాని మోదీకి లేఖ రాశారు.