: స్థిరంగా కొనసాగిన బంగారం ధర


గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు స్థిరంగా కొనసాగింది. దాంతో 10 గ్రాముల పసిడి ధర రూ.26,500 వద్ద నిలిచింది. వెండి ధర మాత్రం రూ.250 పెరిగింది. ఈ క్రమంలో కేజీ ధర రూ.36,000కు చేరింది. నగల వ్యాపారులు స్వల్పంగా కొనుగోళ్లు జరపడంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సంభవించలేదని; పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News