: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 6కు బదులుగా 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని జేఎన్ టీయూహెచ్ వీసీ తెలిపారు. 12న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, 15న సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. 23, 24 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. 28న రెండో విడత విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కొన్ని కళాశాలలు కోర్టుకు వెళ్లడంవలనే షెడ్యూల్ లో మార్పులు జరిగాయని వీసీ వివరించారు. కళాశాలల్లో తనిఖీలు పారదర్శకంగా జరిగాయని, తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. సీట్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని వీసీ స్పష్టం చేశారు.