: రేపు అర్ధరాత్రి జపాన్ కు బయల్దేరుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అర్ధరాత్రి జపాన్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 7న ఆయన సాఫ్ట్ బ్యాంక్ ఛైర్మన్ తో భేటీ అవుతారు. తన పర్యటనలో భాగంగా, ఏపీ రాజధాని శంకుస్థాపనకు రావాలని జపాన్ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. 8వ తేదీ రాత్రి ఆయన ఇండియాకు తిరిగి పయనమవుతారు. మరోవైపు, రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో హౌసింగ్ పాలసీ, బెరైటీస్, ఎర్రచందనం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై వారు చర్చించనున్నారు.