: భద్రాచలం ఎంపీపీగా టీడీపీ మహిళా అభ్యర్థి గెలుపు
పలు నాటకీయ పరిణామాల మధ్య భద్రాచలంలో ఈరోజు జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాంతోపాటు ఉపాధ్యక్ష పదవి కూడా టీడీపీకి చెందిన అనురాధకే దక్కింది. మొత్తం 13 మంది ఎంపీటీసీలు ఉన్న ఈ స్థానంలో ఉదయం నుంచి రాజకీయ పరిణామాలు రసవత్తరంగా చోటుచేసుకున్నాయి. తమ పార్టీతో పాటు సీపీఐ సభ్యులను కూడా టీఆర్ఎస్ సభ్యులు ప్రలోభ పెడుతున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.