: చెల్లెమ్మలూ... కొంగు నడుముకు చుట్టి కదలండి!: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా ఆడపడుచులు కొంగు నడుముకు చుట్టి ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని బాలాజీ దేవాలయంలో 'హరితహారం' ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హరితహారంలో భాగంగా 40 కోట్ల మొక్కలను నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేవలం మొక్కలను నాటడంతోనే పని ఆపేయకుండా వాటిని సంరక్షించాలని, ఆ బాధ్యతను మహిళలే తీసుకోవాలని కోరారు. ప్రతిఒక్కరూ కనీసం 4 నుంచి 5 మొక్కలను చెట్లుగా మార్చే బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ప్రజలకు ఏ మొక్కలైతే అవసరమో వాటినే అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు భవిష్యత్తులో లాభాలను అందించే మామిడి, చింత తదితర చెట్ల పెంపకానికి ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల ఆవరణల్లో, పొలాల గట్లపై, బావుల వద్దా వీటిని పెంచాలని అన్నారు. తమది చేతల ప్రభుత్వమని, మరో రెండేళ్లలో అన్ని రకాల అవసరాలకూ 24 గంటల కరెంటూ ఇస్తామని, పేదలకు రెండు పడకగదుల ఇళ్లను నిర్మించి తీరుతామని అన్నారు.

  • Loading...

More Telugu News