: ఆవును చంపడమంటే హిందూ బాలికను రేప్ చేసినట్టే: ఆర్ఎస్ఎస్


కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక గోసంరక్షణ అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశుమాంసంపై నిషేధం విధించడం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బలగాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు గోవుల తరలింపును అడ్డుకోవాలన్నదే ఆ ఆదేశాల సారాంశం. ఈ మేరకు కఠినంగా వ్యవహరించాలని భద్రత బలగాల అధికారులకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పశ్చిమ బెంగాల్ విభాగం ప్రతినిధి జిష్ణు బసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆవును సంహరించడమంటే ఓ హిందూ బాలికను రేప్ చేయడంతో సమానమని అన్నారు. లేదా, ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినంత అని పేర్కొన్నారు. అటు, దూడలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మహ్మద్ తరఫ్దార్ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతడేమంటున్నాడంటే... "పశు మాంసం తినేందుకు, అమ్మేందుకు నా మతం అనుమతిస్తుంది. మరి, హిందువులకు సమస్య ఏంటి?" అని ప్రశ్నిస్తున్నాడు.

  • Loading...

More Telugu News