: కుక్క పిల్లలనుకుని తెచ్చి పెంచితే ఎలుగు బంట్లయ్యాయి!


కుక్క పిల్లలని పెంచుకోవడం మొదలు పెడితే అవి ఎలుగుబంట్లైన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చైనా, వియత్నాం సరిహద్దులలో ఉండే యున్నన్ ప్రాంతానికి చెందిన వాంగ్ కైయూ 2013లో అరటితోట నాటేందుకు పొలానికి వెళ్లాడు. అక్కడ కళ్లు తెరవని రెండు జంతు పిల్లలు కనిపించాయి. వాటిని కుక్క పిల్లలుగా భావించిన వాంగ్ జాగ్రత్తగా రెండేళ్లు పెంచాడు. ఈ క్రమంలో అవి కృూరంగా ప్రవర్తించినా, వాంగ్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వాటి వ్యవహారాన్ని చూసిన ఇరుగుపొరుగు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరుగు పొరుగు వ్యాఖ్యలతో వాస్తవం అర్థం చేసుకున్న వాంగ్ కైయూ కూడా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వాటిని ఆసియాలోని అతి కృూరమైన ఎలుగుబంటి జాతికి చెందినవిగా గుర్తించి, యున్నన్ లోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

  • Loading...

More Telugu News