: రేవంత్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘిస్తే, అప్పుడు మా తలుపు తట్టండి: సుప్రీంకోర్టు


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి సహేతుక కారణాలతోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేయడంలో తనకున్న విచక్షణాధికారాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదని చెప్పింది. ఈ కేసులో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. బెయిల్ మంజూరు చేసేటప్పుడు హైకోర్టు పెట్టిన షరతులలో దేన్నైనా రేవంత్ ఉల్లంఘిస్తే, అప్పుడు తమ తలుపు తట్టవచ్చని తెలంగాణ ఏసీబీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

  • Loading...

More Telugu News