: కొత్త పథకం ప్రకటించిన జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో నూతన పథకం ప్రవేశపెట్టనున్నారు. బిడ్డలకు పాలిచ్చే బాలింతల కోసం బహిరంగ ప్రదేశాల్లో స్పెషల్ రూములు నిర్మించనున్నారు. ఈ మేరకు బస్ స్టేషన్లలోనూ, బస్ స్టాపుల వద్ద ప్రత్యేక గదులు నిర్మించాలని జయ అధికారులను ఆదేశించారు. ప్రయాణ సమయాల్లో బిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులు ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షెల్టర్లను ఆగస్టు 1 నుంచి ఆరంభిస్తారు. జయలలిత మళ్లీ సీఎం పీఠం అధిష్ఠించిన తర్వాత చాలా పథకాలను ప్రవేశపెట్టారు. గృహ, తాగునీరు, ఉపాధికి సంబంధించిన పథకాలను ఆమె ప్రారంభించారు.