: అడ్డంగా బుక్కైన చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణం....వైఎస్ జగన్ విసుర్లు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఆడియో టేపుల్లో అడ్డంగా బుక్కైన చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కొద్దిసేపటి క్రితం కాకినాడలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 నుంచి 20 కోట్ల మేరకు ఇచ్చేందుకు బహిరంగంగా బేరసారాలు నెరపిన సీఎం దేశ చరిత్రలో ఒక్క చంద్రబాబు తప్ప మరెవరూ లేరని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు ఇఫ్పుడే సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, అందులో ఒక భాగమేనని పేర్కొన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు సెక్షన్ 8 వాదనను ఎత్తుకున్నారని ఆయన ఆరోపించారు. సిగ్గుమాలిన చంద్రబాబు... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సెక్షన్ 8 రాగం అందుకున్నారని జగన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News