: మధ్యప్రదేశ్ లో కుక్కకు ఆధార్ కార్డ్!


గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆధార్ కార్డ్ పొందేందుకు ఇప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటారు. కానీ, మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి మాత్రం తన కుక్కకు ప్రభుత్వ గుర్తింపు కార్డును పొందడం ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆ రాష్ట్రంలోని బింద్ జిల్లాలో అజంఖాన్ అనే వ్యక్తి తన కుక్కకు 'టామీ సింగ్' పేరుతో ఆధార్ కార్డు తీసుకున్నాడని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కార్డులో కుక్క ఫొటో, దాని కింద టామీ సింగ్ అనే పేరు, సన్ ఆఫ్ శేరు సింగ్ అని ఉంది. ఇక నవంబర్ 26, 2009లో ఆ కుక్క పుట్టినట్టు కార్డులో తేదీ కూడా ఉంది. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు అజంను అరెస్టు చేసి విచారించారు. ఇతర జంతువులు లేదా ఇతరులకు కూడా ఆధార్ కార్డులు తయారు చేయిస్తున్నాడా? అన్న కోణంలో ప్రశ్నించారట. అయితే వాస్తవానికి అతను ఉమ్రి అనే ప్రాంతంలో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఏజెన్సీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడట. ఈ క్రమంలో కుక్కలు, ఇతర జంతువులకు 'ఖాన్ ఏజెన్సీ' కార్డులు తయారు చేయిస్తోందన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే అతనిపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News