: యువతికి వివాహం కావాలంటే...!: ఆరంకెల వేతనం సంపాదిస్తున్న వర్తికా వర్మ అనుభవాలు!
వర్తికా వర్మ... 27 సంవత్సరాల ఈ యువతి, విద్యాధికురాలు. ఆరంకెల వేతనం సంపాదిస్తోంది. ఈ మధ్యనే వివాహం చేసుకోవాలని భావించింది. 30 సంవత్సరాల వయసున్న యువకుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో కాస్తంత అనుభవం సంపాదించుకుంది. వివాహం కావాలంటే ఓ అమ్మాయికి ఏం ఉండాలో చెప్పేస్తోంది. ఆమె అభిప్రాయాల ప్రకారం... 1. జాతకం, జన్మకుండలి తప్పనిసరి. కాబోయే భర్తతో పొసగుతుందా? లేదా? అన్నది ఇవే తేలుస్తాయి. 2. పెళ్లిచూపుల కోసం ఎన్నో శనివారాలు అవసరం 3. అదే రోజు పక్కన తోడుండేందుకు పనిలేని చుట్టాలు కూడా ఉండాలి. వరుడిపై వారి అభిప్రాయం తెలుసుకోవాలిగా? 4. బడ్జెట్: స్థానిక దినపత్రికల్లోని వరుడు కావాలి ప్రకటనల్లో చోటు కోసం, ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ల లో స్థానం కోసం, ఆపై పెళ్లి కుదిరితే కట్నకానుకలు ఇచ్చేందుకు, పెళ్లి ఖర్చులకు డబ్బు రెడీగా ఉంచుకోవాలి. 5. మీ గత జీవిత నడవడిక, ప్రవర్తన గురించి మరవకూడదు. ఇవి ఆమె అనుభవాలు. ఆమెను వివాహం చేసుకునేందుకు 50 మంది వరకూ ముందుకు వచ్చారు. వీరిలో తనకు నచ్చిన వారి గురించి వెతుక్కునే పనిలో చాలా బిజీగా ఉంది. ఆదివారం నాటి పత్రికల్లో వధువు కావాలంటూ వచ్చిన ప్రకటనలు చూస్తోంది. ఇది కేవలం వర్తిక కథ మాత్రమే కాదు. ఇండియాలో ఇలాంటి యువతులు 4 కోట్ల మందికి పైగా నే ఉన్నారు. నిత్యమూ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లను జల్లెడ పడుతూ తమకు నచ్చిన వారిని వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. 2013 నాటి లెక్కల ప్రకారం ఇండియాలోని పెళ్లి సంబంధాల వెబ్ సైట్లలో 3.5 కోట్లకు పైగా రిజిస్టర్డ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ప్రతినెలా అదనంగా 22 లక్షల ప్రొఫైల్స్ వచ్చి చేరుతున్నాయి. వీటిల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే తన భాగస్వామిని వెతకడంలో విజయం సాధిస్తున్నారు. ఇదే శోచనీయం.