: వరుసగా మూడో రోజు... ఫోన్ లైన్లపై దయానిధి మారన్ పై సీబీఐ పశ్నల వర్షం
కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ ను సీబీఐ అధికారులు అంత ఈజీగా వదిలిపెట్టేటట్లు లేరు. ఇప్పటికే రెండు రోజుల పాటు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు తాజాగా, నేడు మూడో రోజు కూడా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేటి ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న దయానిధిమారన్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి మారన్ చెన్నైలోని తన నివాసంతో పాటు ఢిల్లీలోని అధికారిక నివాసంలో దాదాపు 700 ఫోన్ లైన్లను ఏర్పాటు చేయించుకున్నారు. వీటిలో 323 హై డేటా కెపాసిటీ డేటా కేబుళ్లున్నాయి. ఈ లైన్ల వినియోగంతో దయానిధి మారన్ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చారని సీబీఐ ఆరోపిస్తోంది. అంతేకాక సదరు టెలిఫోన్ లైన్లను తన సొంత టీవీ ఛానెల్ ‘సన్ టీవీ’ కోసం వాడుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.