: హరితహారంలో నాటే 31 రకాల మొక్కలు ఇవే...
తెలంగాణ ప్రభుత్వం 'హరితహారం' ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ మధ్యాహ్నం చిలుకూరులో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హరితహారంలో మొత్తం 31 రకాల మొక్కలను నాటుతున్నారు. వాటి జాబితాలో... నేరేడు, జామ, నిమ్మ, ఉసిరి, బాదం, బొప్పాయి, మామిడి, దానిమ్మ, సీతాఫలం, ఈత, చింత వంటి పండ్లచెట్టు... టెకామో, ఎర్ర తురాయి, పచ్చ తురాయి, గన్నేరు వంటి పూల చెట్లు... కానుగ, వేప, నల్ల తుమ్మ, టేకు, బాహీనియా, దిరిశన, టబూబియా, గుల్ మొహర్, జామాయిల్, ఎడాకులపాల, సిల్వర్ ఓక్, తెల్ల మద్ది, వెదురు, మునగ, రెయిన్ ట్రీ, బోగన్ విలియా లాంటి ఇతర మొక్కలు ఉన్నాయి.