: వస్తున్నాం చూడండి... ఫేస్ బుక్ లో 11 మంది హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల సందేశం


ఒకవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్ నాథ్ యాత్ర జరుగుతుంటే, మరోవైపు తామంతా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపుతూ, అత్యాధునిక ఆయుధాలు ధరించిన 11 మంది నిషేధిత హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో ఫోటోను పెట్టారు. వీరంతా ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరిన వారేనని తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టిన ఈ చిత్రాన్ని అధికారులు తీసేసినప్పటికీ, వారిలో ఉన్న వారిని గుర్తించిన భద్రతా దళాలు ప్రమాదాన్ని పసిగట్టాయి. వీరిలో ఇటీవల జమ్మూలో రెండు ఏకే-47 తుపాకులు తీసుకుని పారిపోయిన కానిస్టేబుల్ నజీర్, ట్రాల్ ప్రాంత నివాసి బుర్హాన్ వానీ ఉండడంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ చిత్రాన్ని దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని సోఫియన్ లేదా పుల్వామా జిల్లాలో తీసివుంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News