: సత్యసాయి సమాధిని దర్శించుకున్న చంద్రబాబు
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ప్రకటించారు. పుట్టపర్తి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందుకోసం కనీస వసతులు, రవాణా సౌకర్యాలు పెంపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం సీఎం జీడిపల్లె బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జడ్పీ చైర్మన్ చమన్ ఉన్నారు.