: సరస్వతీ అమ్మవారి ప్రసాదం మరింత ప్రియం... ధరలు పెంచేసిన బాసర ఆలయం
సరస్వతీ అమ్మవారి ప్రసాదం ధరలు పెరిగాయి. అమ్మవారి ప్రసాదంలో భాగంగా భక్తులకు అందుతున్న లడ్డూ ధర రూ.15కు పెరగగా, పులిహోర ధర రూ.10 కు పెరిగింది. ఈ మేరకు ఆదిలాబాదు జిల్లా బాసర ఆలయ కమిటీ ధరలను పెంచుతూ నిన్న నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమల్లోకి కూడా వచ్చేశాయి. ఇదిలా ఉంటే... ప్రసాదం ధరలను పెంచిన కమిటీ, ప్రసాదం పరిమాణాన్ని కూడా పెంచినట్లు తెలుస్తోంది. అయితే పరిమాణాన్ని ఎంతమేరకు పెంచారనే వివరాలు వెల్లడి కాలేదు.