: నలుపు లోదుస్తులు ధరించినందుకు కెనడా క్రీడాకారిణికి 'వింబుల్డన్' నిర్వాహకుల హెచ్చరికలు


వింబుల్డన్ నిర్వాహకులు 'తెలుపు' సంప్రదాయం పేరిట విధించిన నిబంధనలపై టెన్నిస్ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి కింద వరకూ తెల్లటి దుస్తులే ఉండాలన్న ఆంక్షలపై సాక్ష్యాత్తూ రోజర్ ఫెదరరే అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తాజాగా నలుపు రంగు లోదుస్తులు వేసుకుని వచ్చినందుకు కెనడా క్రీడాకారిణి బౌచర్డ్ ను నిర్వాహకులు హెచ్చరించారు. ఆట మధ్యలో ఆమె ధరించిన బ్రా స్ట్రాప్ బయటకు కనిపించడంతో ఇకపై నలుపు లోదుస్తులు ధరించవద్దని ఆమెను హెచ్చరించారు. మేము తెలుపు దుస్తుల్లోకి మారిపోయినా, ఇంకా తెలుపు తెలుపు అని నస పెడుతున్నారని ఫెదరర్ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు. ఇంకో క్రీడాకారిణి బెథానీ మాతెక్ మోకాళ్ల పైకి తెలుపు రంగు సాక్స్ ధరించి వచ్చి తన నిరసన తెలిపింది.

  • Loading...

More Telugu News