: రేవంత్ కేసులో తెలంగాణ తరపున వాదించేందుకు రంగంలోకి కపిల్ సిబల్!


ఎలాగైనా రేవంత్ రెడ్డి బెయిలును రద్దు చేయించాలన్న లక్ష్యంతో ఉన్న తెలంగాణ ఏసీబీ పేరున్న లాయర్లను రంగంలోకి దించింది. తెలంగాణ తరపున వాదించే వారిలో కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఉన్నట్టు సమాచారం. ఆయనతో పాటు సీనియర్ లాయర్లు దుష్యంత్ దావే, హరేన్ రావెల్ లను కూడా తెలంగాణ నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిలు విషయంలో సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ పక్షాన వాదించేందుకు సీనియర్లను సమాయత్తం చేసింది. ఈ కేసు నేటి మధ్యాహ్నం సుప్రీం ధర్మాసనం ముందుకు విచారణకు రానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News