: కర్నూలు జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ కిడ్నాప్
కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన టీడీపీ ఎంపీటీసీ బాల హుస్సేన్ హఠాత్తుగా అదృశ్యమయ్యారు. వైకాపా నేతలే బాల హుస్సేన్ ను కిడ్నాప్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు వైకాపా పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.