: విచారణకు రాకుండా, పిలిస్తే వస్తాననడమేంటి?: సండ్రపై ఏసీబీ గుర్రు


ఓటుకు నోటు కేసులో తామిచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా, అనారోగ్యం పేరిట 20 రోజులు తప్పించుకుని, పిలిస్తే వస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై ఏసీబీ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. జారీ చేసిన నోటీసులను ఆయన పట్టించుకోలేదన్నది ఏసీబీ వాదన. ఈ కేసులో ముగ్గురు నిందితులు బెయిలుపై విడుదల కావడం, కీలక సాక్షిగా భావిస్తున్న సండ్ర విచారణ విషయంలో చేస్తున్న జాప్యం ఏసీబీ అధికారుల్లో అసహనాన్ని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. సండ్ర వ్యవహారంలో తదుపరి ఎలా ముందడుగు వేయాలన్న విషయంలో ఏసీబీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున ఇంకోసారి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కొందరి అభిప్రాయం. నోటీసులు జారీ చేయాలా? లేదా నేరుగా వెళ్లి విచారించాలా? అన్న విషయంపై సమాలోచనలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News