: అమ్మవారి కిరీటం, హుండీనే కాదు... శఠగోపాన్ని కూడా వదల్లేదు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం సందు చిక్కినా కన్నం వేసే పనిలో పడుతున్నారు. ఈ క్రమంలో, అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన మరకతమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గత రాత్రి దొంగలు తమ ప్రతాపాన్ని చూపారు. ఆలయంలోకి చొరబడిన దొంగలు అమ్మవారి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు. చివరకు శఠగోపాన్ని కూడా వదల్లేదు. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చోరులను కనిపెట్టేందుకు క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది.