: బేబీ ఐపీఎల్ వచ్చేస్తోంది!
చాంపియన్స్ లీగ్ టీ-20 పోటీల స్థానంలో మినీ ఐపీఎల్ పోటీలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ, తాజాగా బేబీ ఐపీఎల్ పేరిట పొట్టి క్రికెట్ పోటీలు పెట్టాలన్న ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. ఈ బేబీ ఐపీఎల్ లో 8 జట్లుంటాయని, 15 మ్యాచ్ లు జరుగుతాయని తెలుస్తోంది. జట్లను రెండు గ్రూపులుగా చేసి, లీగ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరపాలన్నది బీసీసీఐ పెద్దల ప్రతిపాదనగా తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన మినీ ఐపీఎల్ లో కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఉంటాయి. ఈ రెండు ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చాంపియన్స్ లీగ్ పోటీలు ఇక జరగవని సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.