: చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గుస్సా!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కస్సుమన్నారట. తొలి పర్యటనలోనే తనకు ముఖం చాటేసిన చంద్రబాబు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో భేటీకి కింది స్థాయి అధికారులను పంపడం ద్వారా పనగరియాను చంద్రబాబు అవమానించినట్లేనని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు విషయం ఏంటేంటే, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ పనగరియా రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలిసారిగా ఏపీ, తెలంగాణలకు వచ్చారు. నిన్న హైదరాబాదు చేరుకున్న పనగరియా ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వంతో భేటీ సందర్భంగా చంద్రబాబు కనిపించలేదు. ఏపీ ప్రభుత్వం తరఫున కిందిస్థాయి అధికారులే పనగరియాతో భేటీకి వచ్చారు. దీంతో కాస్త ఇబ్బందిపడ్డ పనగరియా, తొలి భేటీలోనే చంద్రబాబు తనకు హ్యాండిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.