: వింబుల్డన్ లో పెను సంచలనం... రెండో రౌండులో నాదల్ కు షాకిచ్చిన బ్రౌన్
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్, స్పెయిన్ బుల్, మట్టి కోటలో రారాజు రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన అనామక ప్రత్యర్థి, జర్మనీకి చెందిన డస్టిన్ బ్రౌన్ చేతిలో రెండో రౌండులో నాదల్ ఘోరంగా ఓడిపోయాడు. 5-7, 6-3, 4-6, 4-6 తేడాతో నాదల్ ను ఓడించిన బ్రౌన్ తన టెన్నిస్ జీవిత చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తొలి సెట్లో 5-7తో ఓడిన నాదల్, రెండో సెట్‌ను 6-3తో గెలిచినప్పటికీ, ఆ తరువాత బ్రౌన్ ధాటికి తాళలేకపోయాడు.