: తిరుమల కాలిబాటలో చిరుతల సంచారం... భయాందోళనల్లో భక్తులు
తిరుమల వెంకన్న సన్నిధికి దారితీసే కాలిబాటలో మరోమారు చిరుతల కలకలం రేగింది. శ్రీవారిమెట్టు సమీపంలో భక్తులకు నేటి తెల్లవారుజామున చిరుత పులులు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు వెనువెంటనే చిరుతల సంచారంపై టీటీడీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగప్రవేశం చేసిన అటవీ శాఖాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాక కాలిబాటన తిరుమల కొండకు వెళుతున్న భక్తులను కొద్దిసేపు నిలిపివేశారు. బృందాలుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.