: మాచర్లలో దోపిడీ దొంగల బీభత్సం... తుపాకీతో బెదిరించి వైద్యుడి ఇంటిలో చోరీ
గుంటూరు జిల్లా మాచర్లలో నేటి తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తుపాకీ చేతబట్టిన ముగ్గురు దొంగలు మాచర్లలోని ఎంఎస్ఆర్ కాలనీలోని ఓ వైద్యుడి ఇంటికి వచ్చారు. వైద్యుడిని తుపాకీతో బెదిరించి ఇంటిలోకి చొరబడ్డారు. అనంతరం వైద్యుడి ఇంటిలో ఉన్న 15 తులాల బంగారంతో పాటు చేతికి చిక్కిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తరహాలోనే ఇటీవలే అక్కడ ఓ చోరీ చేసుకుందట. కేవలం నెల వ్యవధిలోనే ఒకే తరహాలో రెండు చోరీలు జరగడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.