: ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ నేడే... ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు


ఏపీలోని ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలను అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం దాదాపు ఖరారైనా, కర్నూలు జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. నేటి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రెండు జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్కంఠ పోటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలోనే మోహరించారు.

  • Loading...

More Telugu News