: డ్రీం గర్ల్ హేమమాలినికి రోడ్డు ప్రమాదం... గాయాలు, చిన్నారి మృతి


బాలీవుడ్ 'డ్రీం గర్ల్' హేమమాలిని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగ్రా నుంచి జైపూర్ వెళ్తుండగా, రాజస్థాన్ లోని దౌసాలో ఆమె కారును మరో కారు బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో హేమమాలిని తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను జైపూర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News