: మదర్సాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదు: అసదుద్దీన్ ఒవైసీ
ముస్లిం సంస్థలు నిర్వహించే మదర్సాలను రద్దుచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మహారాష్ట్రలో మదర్సాలపై నిషేధం విధించడంపై ఆయన ముంబైలో మాట్లాడుతూ, మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఆ స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎక్కడ చదువుకోవాలో వారి తల్లిదండ్రులే నిర్ణయించుకుంటారని అన్నారు. అలా కాకుండా ప్రభుత్వాలు నిర్ణయించడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. మదర్సాలను నిర్వహించుకోవచ్చని రాజ్యాంగంలోని పలు సెక్షన్లు చెబుతున్నాయని, మైనారిటీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాయాలని చూస్తే సహించేది లేదని అసదుద్దీన్ తెలిపారు.