: 'ఆల్ ఈజ్ వెల్' ట్రైలర్ ను తొలి రోజే 11 లక్షల మంది చూశారు
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆల్ ఈజ్ వెల్' సినిమా ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లోనే 11 లక్షలకు పైగా అభిమానులు దీనిని వీక్షించడం విశేషం. దీనిపై అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, అసిన్, రిషి కపూర్, ప్రత్యేక గీతంలో సోనాక్షి సిన్హా నటిస్తుండగా, ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.