: పెళ్లికి నేను రెడీ: సల్మాన్ ఖాన్


'పెళ్లి చేసుకునేందుకు నేను రెడీగా ఉన్నా'నని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా, 'షాహిద్ కపూర్ వివాహం చేసుకుంటున్నాడు, మీరెప్పుడు వివాహం చేసుకుంటారు?' అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని అన్నాడు. అయితే తనను ఎవరూ 'పెళ్లి చేసుకుంటావా?' అని అడగడం లేదని అన్నాడు. 'ఎవరైనా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే అప్పుడు తప్పకుండా ఆలోచిస్తా'నని సల్లూభాయ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News