: నా కుమార్తె గురించి నేను మాట్లాడను...ఎవరు మాట్లాడినా ఒప్పుకోను: అభిషేక్ బచ్చన్


సెలబ్రిటీ ఆర్భాటాలకు దూరంగా తన కుమార్తెను పెంచాలని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భావిస్తున్నాడు. అభిషేక్ బచ్చన్ కొత్త సినిమా 'ఆల్ ఈజ్ వెల్' టీజర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను, తన భార్య సెలబ్రిటీలైనంత మాత్రాన తమ కుమార్తె (ఆరాధ్య) కూడా అలానే ఉండాలని భావించడం పొరపాటని అన్నారు. సెలబ్రిటీ ఆర్భాటాలకు దూరంగా ఆరాధ్య ఉంటుందని, ఆమె గురించి తాను మాట్లాడనని, కుటుంబ సభ్యులు మినహా, ఎవరు మాట్లాడినా సహించనని అభిషేక్ బచ్చన్ స్పష్టం చేశాడు. ఆరాధ్య ప్రేక్షకులకు దూరంగా ఉంటుందని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News