: వింబుల్డన్ పై ఉగ్రభానుడి ప్రతాపం... సొమ్మసిల్లిన బాల్ బాయ్


బ్రిటన్ లో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉక్కపోత వాతావరణంలో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ జరుగుతోంది. లండన్ పరిసరాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వీలైనంత త్వరగా మ్యాచ్ లు ముగించేందుకు ఆరాటపడుతున్నారు. ఇక, ప్రేక్షకుల సంగతి సరేసరి. పెనం మీద అట్టులా మాడిపోతున్నారు! అక్కడ ఎండలు ఎలా ఉన్నాయంటే, టెన్నిస్ కోర్టులో బంతులు అందించే ఓ బాల్ బాయ్ ఎండ వేడిమికి తాళలేక కుప్పకూలిపోయాడు. సొమ్మసిల్లిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని వింబుల్డన్ నిర్వాహకులు తెలిపారు. కాగా, మ్యాచ్ ల సందర్భంగా ఆటగాళ్లు ఐస్ ప్యాక్ లు పెట్టుకుంటూ సేద దీరుతున్నారట. ఇక, మ్యాచ్ లకు వేదికగా నిలుస్తున్న ఆల్ ఇంగ్లండ్ క్లబ్ పరిసరాల్లో సన్ క్రీములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట.

  • Loading...

More Telugu News