: బీజేపీ నేతల నిర్వాకంపై వివరణ కోరిన పీఎంవో


బీజేపీ నేతలు వివాదాలకు నిలయంగా మారుతుండడంపై ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే సుష్మ, వసుంధర, స్మృతీ వివాదాలతో తలనొప్పి అనుభవిస్తున్న కేంద్రానికి... తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచాయని వార్తలు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర మంత్రుల కారణంగా విమానాలు ఆలస్యంగా నడవడంపై పౌర విమానయాన శాఖను పీఎంవో వివరణ అడిగింది. ఈ విషయాన్ని పీఎంవోకు చెందిన ఓ అధికారి ట్విట్టర్లో పేర్కొన్నారు. వారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News