: అది కూడా ఒక వార్తేనా?: మీడియాపై చిందులు తొక్కిన జానా


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పిలిచేందుకు ఆయన సోదరుడితో కలిసి టీఆర్ఎస్ ఎంపీ తన నివాసానికి వచ్చారని అన్నారు. ఆయన తన ఇంటికి రావడంలో వేరే కారణాలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసానికి వచ్చినా ఇలాగే ఆహ్వానిస్తానని ఆయన అన్నారు. 'దానిపై లేనిపోని వార్తలు అల్లేశారు. వారు మా ఇంటికి రావడం కూడా వార్తేనా?' అంటూ ఆయన మీడియాపై చిందులు తొక్కారు.

  • Loading...

More Telugu News