: గంగూలీ ఆఫర్ ను కాదనలేకపోయా: ఓజా
బౌలింగ్ యాక్షన్ సరిగా లేదన్న కారణంతో టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాజా దేశవాళీ సీజన్ కోసం సన్నద్ధమయ్యాడు. ఇప్పటిదాకా హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓజా ఇకపై బెంగాల్ జట్టుకు ఆడనున్నాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనతో మాట్లాడాడని, బెంగాల్ టీమ్ కు ఆడమని కోరాడని ఓజా తెలిపాడు. గంగూలీ అడగడంతో కాదనలేకపోయానని వివరించాడు. పైగా, తాను జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన నేపథ్యంలో మంచి జట్టు తరపున ఆడడం కూడా ముఖ్యమన్న విషయం గుర్తించానని చెప్పాడు. బెంగాల్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్నానని, 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్ఓసీ) కూడా సిద్ధంగా ఉందని తెలిపాడు.