: పెళ్లిపై త్రిష అభిప్రాయాలు ఇవే!


ప్రముఖ నటి త్రిష తన పెళ్లిపై తొలిసారి బహిరంగంగా మాట్లాడింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడినప్పుడే వివాహం చేసుకుంటానని చెప్పింది. వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం బెడిసి కొట్టడంతో కొంత కాలం మీడియాకు దూరంగా ఉన్న త్రిష ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పలు విషయాలు వెల్లడించింది. నిశ్చితార్థం రద్దవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది. జరిగిపోయిన దానిపై మాట్లాడడం ఇష్టం లేదని త్రిష స్పష్టం చేసింది. ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందని, అయితే సమాజం కోసం పెళ్లి చేసుకోకూడదని అంది. సరైన వ్యక్తి తారసపడి ఉంటే 25 ఏళ్లకే వివాహం చేసుకుని ఉండేదానినని, వివాహానికి వయసు అడ్డం కాదని స్పష్టం చేసింది. తన జీవితంలో ఏం జరిగినా దానిపై సమాధానం చెప్పాల్సింది కేవలం తన తల్లికేనని త్రిష స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News