: చంద్రబాబుకు ఏం జరుగుతుందో రెండు రోజుల్లో తెలుస్తుంది: తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు సంభవించనున్నాయని, మరో రెండు రోజుల్లో చంద్రబాబునాయుడికి ఏం జరుగుతుందో తెలుస్తుందని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు బలిపశువును చేశారని విమర్శించారు. రేవంత్ ను కేసులో ఎవరూ ఇరికించ లేదని, బాబు సలహా సూచనలు వినివచ్చి ఆయనే స్వయంగా ఇరుక్కున్నారని అన్నారు. హైదరాబాదులోని ప్రజల మధ్య గొడవలు రేపి, తన పబ్బం గడుపులోవాలన్న ఉద్దేశంతోనే సెక్షన్ 8ను తేవాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.