: ఏపీలో రెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మార్పు
ఆంధ్రప్రదేశ్ లో రెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లను ప్రభుత్వం మార్చింది. శ్రీకృష్ణ దేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును గాలేరు నగరి సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చింది. అనంత వెంకటరెడ్డి హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పేరు హంద్రినీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.