: రేవంత్ హద్దు మీరి మాట్లాడారు... 'ఆకు రౌడీ'లా ప్రవర్తించారు: తుమ్మల
జైలు నుంచి విడుదలైన తర్వాత టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హద్దు మీరి మాట్లాడారని... ఆకు రౌడీలా ప్రవర్తించారని టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇకనైనా రేవంత్ సరైన పద్ధతిలో వ్యవహరించాలని సూచించారు. టీడీపీ నేతలు స్వలాభం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అద్దె మనుషులతో ఊరేగింపు చేయడం హీరోయిజం కాదని అన్నారు. టీడీపీ నేతల ప్రవర్తనను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.