: వచ్చే ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: చంద్రబాబు


వచ్చే సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 15లోగా పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గోదావరి ఉద్ధృతి కారణంగా పట్టిసీమ పనుల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేస్తామని, హంద్రినీవా, గాలేరు ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు.

  • Loading...

More Telugu News