: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రకాశం జడ్పీ మాజీ చైర్మన్ కు అనుమతి


ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రకాశం జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల తరువాత ఈదర ఓటును సీల్డ్ కవర్ లో ఉంచాలని ఎన్నికల కమిషన్ ను కోర్టు ఆదేశించింది. ఆ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తే ఈదర అనర్హత పిటిషన్ పై ఈ నెల 8న విచారించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. టీడీపీ నుంచి బయటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఈదర... వైసీపీ అనుకూల ఓట్లు పడటంతో అనూహ్యంగా ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. దాంతో ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేయగా, అధికారులకు సూచించడంతో అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News