: రూపాయి నోటు ముద్రణకు రూ. 1.14 ఖర్చు... ఎలా ఉంటుందో ఆర్బీఐ అధికారులకూ తెలియదట!


కొత్తగా రూపాయి నోట్లను ముద్రించాలని నిర్ణయించుకున్న కేంద్రం ఒక్కో రూపాయి నోటు ముద్రణకు దాని విలువకన్నా ఎక్కువ ఖర్చు పెడుతోంది. ఒక్కో నోటు తయారీకి రూ. 1.14 వెచ్చిస్తోంది. ఈ నోట్ల ప్రింటింగు రాజస్థాన్ లోని నాథ్ ద్వారాలో జరుగుతోంది. కాగా, ఈ నోటు ఎలా ఉంటుందో రిజర్వ్ బ్యాంకు అధికారులకు కూడా ఇప్పటి వరకూ తెలియకపోవడం గమనార్హం. రూపాయి డిజైన్ నుంచి ప్రింటింగ్ వరకూ అత్యంత రహస్యంగా సాగుతోంది. త్వరలోనే ఈ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. మిగతా అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటే, రూపాయి నోటుపై మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. కాగా, సుమారు రెండు దశాబ్దాల క్రితం తయారీ ఖర్చు పెరుగుతోందని చెబుతూ, రూపాయి నోట్ల ముద్రణను నిలిపివేశారు. ఆపై గత సంవత్సరం డిసెంబరులో తిరిగి వీటిని ముద్రించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త రూపాయి నోట్లు 100 మైక్రాన్ల మందాన్ని కలిగివుంటాయి.

  • Loading...

More Telugu News